NGKL: బిజినపల్లి మండల కేంద్రంలోని లింగమయ్య కాలనీలో గురువారం ఉదయం ఘోర ప్రమాదం జరిగింది. స్థానికుల వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన బత్తుల రాములు-అనూషల కుమారుడు బత్తుల నితిన్(8) షాప్‌కి వెళ్లి వస్తున్నాడు. ఈ క్రమంలో రోడ్డుపై వెళ్తున్న ట్రాక్టర్ బలంగా ఢీకొట్టింది. దీంతో బాలుడి తలకు తీవ్ర గాయాలయై అక్కడికక్కడే మృతిచెందాడు.