టాలీవుడ్ హీరో నిఖిల్ ప్రధాన పాత్రలో డైరెక్టర్ భరత్ కృష్ణమాచారి తెరకెక్కిస్తున్న సినిమా ‘స్వయంభూ’. ఈ సినిమాలో నభా నటేష్, సంయుక్త మీనన్ హీరోయిన్స్‌గా నటిస్తున్నారు. తాజాగా నభా నటేష్ పాత్రను మేకర్స్ రివీల్ చేశారు. ఈ మూవీలో ఆమె సుందర వల్లి పాత్రలో కనిపిస్తున్నట్లు పోస్టర్ షేర్ చేశారు. ప్రస్తుతం ఇది నెట్టింట వైరల్ అవుతోంది.