ఐస్ బాత్ చేయడం వల్ల ప్రయోజనాలున్నాయని నిపుణులు చెబుతున్నారు. చల్లటి నీటిలో 5-15 నిమిషాల పాటు శరీరాన్ని ఉంచుతారు. ఇలా చేయడం వల్ల మానసిక స్థితి మెరుగుపడుతుంది. నిద్ర మంచిగా పడుతుంది. నాడీ వ్యవస్థ మెరుగుపడుతుంది. రక్త ప్రసరణ సాఫీగా జరుగుతుంది. బరువు తగ్గడంతో పాటు గుండె ఆరోగ్యానికి మంచిది. కండరాల పునరుద్ధరణను పెంచుతుంది. కానీ నరాల సమస్య, గుండె సమస్య, సున్నితమైన చర్మం ఉన్నవారు దీనికి దూరంగా ఉండటం మంచిది.