AP: ఇవాళ సూపర్ స్టార్ రజనీకాంత్ పుట్టిన రోజు సందర్భంగా సీఎం చంద్రబాబు శుభాకాంక్షలు తెలిపారు. ‘నా ప్రియ మిత్రుడు, సూపర్ స్టార్ రజనీకాంత్‌కు జన్మదిన శుభాకాంక్షలు. ఆయురారోగ్యం, సంతోషంతో మరెన్నో పుట్టినరోజులు జరుపుకోవాలని ఆకాంక్షిస్తున్నా’ అని పేర్కొన్నారు. ఈ మేరకు ట్వీట్ చేసిన సీఎం.. రజనీకాంత్‌తో కలిసి ఉన్న ఫొటోను పోస్ట్ చేశారు.