TG: మంత్రి కొండా సురేఖపై హీరో నాగార్జున వేసిన పిటిషన్పై నాంపల్లి కోర్టు విచారణ చేపట్టింది. పరువు నష్టం కేసు విచారణ సందర్భంగా కొండా సురేఖ తరపున ఆమె లాయర్ కోర్టుకు హాజరయ్యారు. కొండా సురేఖ హాజరుకావటానికి మరో తేదీని ఇవ్వాలని ధర్మాసనానికి విజ్ఞప్తి చేశారు. దీంతో ఈ కేసులో తదుపరి విచారణను ఈ నెల 19కి వాయిదా వేస్తూ కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది.