AP: వైసీపీ నేత ప్రేమ్‌కుమార్ అరెస్ట్‌పై గుంటూరు ఎస్పీకి వైసీపీ నేతలు ఫిర్యాదు చేశారు. అనంతరం మాజీమంత్రి అంబటి రాంబాబు మాట్లాడుతూ.. ప్రేమ్‌కుమార్‌ను అక్రమంగా అరెస్ట్ చేశారని మండిపడ్డారు. అరెస్ట్‌పై ఎలాంటి సమాచారం ఇవ్వలేదని.. రెడ్‌బుక్ రాజ్యాంగంతో వైసీపీ నేతలను వేధిస్తున్నారని ఫైర్ అయ్యారు. పోలీసులు రౌడీల్లా వ్యవహరిస్తున్నారని.. ఈ అంశంపై న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తామని తెలిపారు.