AP: పర్యావరణ ప్రేమికుడిని స్థంబానికి కట్టేసి దాడి చేసిన ఘటన నిన్న అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో జరిగింది. ఉప్పలగుప్తం మండలంలోని సన్నవల్లిలో ఆక్వా సంస్థల కారణంగా ప్రకృతి వనరుల దుర్వినియోగానికి పాల్పడుతున్నారని దుర్గా ప్రసాద్ అనే యువకుడు అధికారులకు ఫిర్యాదు చేశాడు. దీంతో అతన్ని స్థంబానికి కట్టేసి అతనిపై నలుగురు దాడి చేశారు. ఈ ఘటనపై స్పందించిన అధికారులు దాడి చేసిన వారిపై కేసునమోదు చేసి రిమాండ్కు తరలించారు.