SRD: వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో ప్రారంభించనున్న ఫర్టిలైజర్ బుకింగ్ యాప్ను సద్వినియోగం చేసుకోవాలని జిల్లా వ్యవసాయశాఖ అధికారి శివప్రసాద్ ఆదివారం తెలిపారు. రైతులు యూరియా పొందాలంటే ప్లే స్టోర్ నుంచి ఫర్టిలైజర్ బుకింగ్ యాప్ డౌన్ లోడ్ చేసుకోవాలన్నారు. రైతులు ఈ యాప్లో తమ వివరాలను నమోదు చేసుకుని, యూరియా పొందాలని సూచించారు.