KMR: బాన్సువాడ మండలంలో 15 గ్రామపంచాయతీలో ఇవాళ ఎన్నికలు కొనసాగుతున్నాయి. ఉదయం 7 గంటలకే గ్రామాలలో పోలింగ్ ప్రారంభమైంది. దీంతో కొన్ని గ్రామాల్లో ఉదయం నుంచే ఓటు వేయడానికి ఓటర్లు రాగా, మరికొన్ని గ్రామాల్లో చలికి భయపడి ఒకరు ఇద్దరు తప్పించి పోలింగ్ కేంద్రాలకు రాలేకపోయారు. చలి ఎఫెక్ట్‌తో ఆ గ్రామాల్లో 8 దాటుతున్న ఆ పోలింగ్ కేంద్రాలకు ఓటర్లు రాలేకపోతున్నారు.