PDPL: రామగుండం కమిషనరేట్ పరిధిలో దొంగలు పోలీసులకు సవాల్ విసురుతున్నారు. ఈ మధ్య కాలంలో కమిషనరేట్ పరిధిలో దొంగతనాలు ఎక్కువగా జరగడం ఈ సంకేతాన్ని సూచిస్తోంది. రామగిరి మండలంలో పది రోజుల క్రితం రెండు ఇళ్లలో 3 రోజుల వ్యవధిలో చోరీలకు పాల్పడిన ఘటన మరవక ముందే ముత్తారం మండలం ఓడేడు గ్రామంలో గుజ్జు జంగా రావు ఇంటిలో గుర్తుతెలియని వ్యక్తులు చోరీకి పాల్పడ్డారు.