MBNR: జడ్చర్ల మండలం కిష్టారం సమీపంలో పోతిరెడ్డి చెరువు అలుగు దాటే ప్రయత్నంలో గురువారం సాయంత్రం వృద్ధ దంపతులు గల్లంతైన విషయం తెలిసిందే. రెండు రోజులుగా దంపతుల కోసం ఎస్డీఆర్ఎఫ్ బృందం గాలింపు చర్యలు చేపట్టారు. గల్లంతైన దంపతులతో భార్య తానేం రాములమ్మ మృదేహం శనివారం లభ్యమైంది. కాగా, భర్త ఆచూకీ కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి.