BDK: పినపాక మండలం ఈ బయ్యారం గ్రామంలో సర్వే జరుగుతోందని డిప్యూటీ డైరెక్టర్ సుబ్బరాజు వెల్లడించారు. ఇవాళ పినపాక మండల వ్యాప్తంగా జనగణన, ఇంటి గణన కార్యక్రమాన్ని ప్రత్యేక టీములుగా ఏర్పాటు చేసి నిర్వహిస్తున్నామని తెలిపారు. స్టాటిస్టికల్ ఆఫీసర్ సీహెచ్ సతీష్, హిమవర్ష, హరిత, వినయ్, తిరుపతి ప్రత్యేక టీములుగా ఇంటింటి సర్వే నిర్వహిస్తున్నట్లు తెలిపారు.