KMR: ఆర్థిక ఇబ్బందులతో ఆత్మహత్య చేసుకున్న వీరాపూర్ దుబ్బకు చెందిన ప్రహ్లాద్ కుటుంబాన్ని శనివారం మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్ రెడ్డి, మాజీ జడ్పీటీసీ సతీష్ పరామర్శించారు. ముగ్గురు ఆడపిల్లల పోషణ భారమై, మరో సంతానం కూడా ఆడపిల్ల పుడుతుందనే భయంతో ప్రహ్లాద్ ఈనెల 3న తనువు చాలించారు. బాధిత కుటుంబ సభ్యులను ఓదార్చి, వారికి రూ.22 వేల ఆర్థిక సాయం అందజేశారు.