»20 Thousand Central Forces To Telangana Armed Arrangements For Assembly Elections
Election Commission: తెలంగాణకు 20 వేల కేంద్ర బలగాలు..అసెంబ్లీ ఎన్నికలకు పకడ్బందీ ఏర్పాట్లు
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు కేంద్ర బలగాలు వచ్చేశాయి. ఈసారి మొదటగా 20 కేంద్ర బలగాలను ఎన్నికల కమిషన్ రంగంలోకి దింపింది. ఎన్నికల సమయానికి మరిన్ని బలగాలు రంగంలోకి దిగనున్నట్లు వెల్లడించింది. ఎన్నికలకు పకడ్బందీగా ఈసీ ఏర్పాట్లు చేస్తోంది.
తెలంగాణ (Telangana)లో అసెంబ్లీ ఎన్నికలు (Assembly Elections) జరగనున్న సంగతి తెలిసిందే. అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో రాచకొండ పోలీసు సిబ్బందికి సాయం చేసేందుకు ఓ 7 కేంద్ర బలగాలు తెలంగాణకు ఇప్పటికే వచ్చేశాయి. ఇప్పుడు మరో 20 వేల కేంద్ర బలగాలను ఎన్నికల కమిషన్ (Election Commissions) రంగంలోకి దింపింది. తొలి విడత ఈ బలగాలు రాచకొండ పోలీస్ సిబ్బందితో కలిసి పలు నియోజకవర్గాల్లో ఫ్లాగ్ మార్చ్ వంటి కవాతులు నిర్వహిస్తాయి. పోలీస్ కమిషనర్ డిఎస్ చౌహన్ ఎన్నికలకు పకడ్బందీ ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. ఎన్నికల నేపథ్యంలో పాత నేరస్తులను ముందు జాగ్రత్త చర్యలలో భాగంగా బైండోవర్ చేస్తున్నట్లు వెల్లడించారు.
ఇప్పటికే తెలంగాణ వ్యాప్తంగా అవసరమైన ప్రదేశాల్లో పోలీసులు చెక్ పోస్టులు (Check Posts) ఏర్పాటు చేశారు. సరైన పత్రాలు లేకుండా తరలిస్తున్న నగదును, తదితర వస్తువులను ఎక్కడికక్కడ సీజ్ చేస్తున్నారు. మరోవైపు ఎన్నికల్లో ఎలాంటి సమస్యలు రాకుండా, అవకతవకలు జరగకుండా ఉండేందుకు ఎన్నికల సంఘం కసరత్తు చేస్తోంది. గతంలో 10,000 మందితో కూడిన కేంద్ర బలగాలను తెలంగాణ వ్యాప్తంగా భద్రత కోసం ఏర్పాటు చేసింది. ఈసారి దాన్ని రెట్టింపు చేసినట్లు కేంద్ర ఎన్నికల సంఘం వెల్లడించింది.
అస్సాం రైఫిల్స్ బోర్డర్స్ సెక్యూరిటీ ఫోర్స్, సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్, సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్, ఇండో టిబెటన్ బోర్డర్ పోలీస్ ఫోర్స్, నేషనల్ సెక్యూరిటీ గార్డ్స్, శశాస్త్ర సీమా నుంచి 80 మంది సిబ్బంది మొదటగా తెలంగాణకు రానున్నాయి. ఆ తర్వాత మిగిలిన బలగాలు వచ్చి చేరనున్నాయి. ప్రస్తుతం పలు నియోజకవర్గాల్లో కేంద్ర పారా మిలిటరీ బలగాలు ఫ్లాగ్ మార్చ్‌ను నిర్వహించనున్నట్లు ఎన్నికల సంఘం తెలిపింది.