HNK: నర్సంపేట నియోజకవర్గ MLA దొంతి మాధవరెడ్డి మాతృమూర్తి కాంతమ్మ ఇటీవల అనారోగ్యంతో మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ విషయం తెలుసుకున్న MHBD ఎంపీ పోరిక బలరాం నాయక్ శనివారం సాయంత్రం HNKలోని MLA దొంతి నివాసానికి వెళ్లి కాంతమ్మ చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు. అనంతరం MLA కుటుంబాన్ని పరామర్శించి, ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.