MDK: పంచాయతీ ఎన్నికలు చలికాలంలోనూ రాజకీయ వేడిని పుట్టిస్తున్నాయి. పోలింగ్ తేదీలు దగ్గర పడుతుండటంతో సర్పంచ్, వార్డు అభ్యర్థులకు ఓటర్ల నాడి అంతుచిక్కడం లేదు. ఓటర్లు గ్రూపులుగా ఏర్పడి ఎవరు ఎక్కువ డబ్బు ఇస్తే వారి వెంటే ప్రచారంలో తిరుగుతున్నారు. అయితే, ఓటు మాత్రం రహస్యంగా ‘మీకే వేస్తాం’ అని చెప్పడంతో అభ్యర్థులు అయోమయంలో పడ్డారు.