SRCL: పర్యావరణ పరిరక్షణ కోసం మట్టి గణపతి విగ్రహాలనే పూజించాలని రాజన్న సిరిసిల్ల కలెక్టర్ సందీప్ కుమార్ ఝా ప్రజలకు పిలుపునిచ్చారు. పొల్యూషన్ కంట్రోల్ బోర్డు రూపొందించిన అవగాహన పోస్టర్ను ఆయన శనివారం ఆవిష్కరించారు. ఈ ఏడాది జిల్లాలో 2,000 మట్టి గణపతి విగ్రహాలను ఉచితంగా పంపిణీ చేయనున్నట్లు తెలిపారు.