NRML: రాష్ట్రస్థాయి సీఎం కప్ పోటీలలో జిల్లా క్రీడాకారులు ఉత్తమ ప్రదర్శన కనబరిచినట్లు కలెక్టర్ అభిలాష అభినవ్ శనివారం ప్రకటనలో తెలిపారు. వెయిట్ లిఫ్టింగ్ 77 కిలోల విభాగంలో సారంగాపూర్ కళాశాలకు చెందిన వర్షిని బంగారు పతకం,102 కిలోల విభాగంలో దస్తురాబాద్ మండలం ప్రభుత్వ పాఠశాలకు చెందిన అభిషేక్ కాంస్య పతకం సాధించినట్లు కలెక్టర్ తెలిపారు.