NLG: తెలంగాణ రాష్ట్ర గీతం జయ జయహే తెలంగాణ సృష్టికర్త, కవి, రచయిత డాక్టర్ అందెశ్రీ అకాల మరణం యావత్ తెలంగాణ సమాజానికి తీరని లోటని ఎమ్మార్పీఎస్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ చేకూరి గణేష్ అన్నారు. రాష్ట్రంలో ఏదైనా యూనివర్సిటీకి అందెశ్రీ పేరు పెట్టాలని ప్రభుత్వాన్ని కోరారు. అలాగే ఆయన విగ్రహాన్ని ట్యాంక్ బండ్పై ఏర్పాటు చేయాలని పేర్కొన్నారు.