MBNR: జడ్చర్ల పట్టణ కేంద్రంలో దసరా ఉత్సవాలు ఘనంగా జరిగాయి. ప్రభుత్వ డిగ్రీ కాలేజీలో ఏర్పాటు చేసిన జమ్మి పూజ, రావణ దహనం కార్యక్రమంలో ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి పాల్గొన్నారు. ఆయన తన కుటుంబ సభ్యులతో కలిసి జమ్మి పూజ నిర్వహించి అనంతరం రావణ దహనాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమాన్ని తిలకించడానికి ప్రజా ప్రతినిధులు, పట్టణ ప్రజలు పరిసర గ్రామాల ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు.