NRPT: గురుకులలో అవరోహణ క్రమంలో ఉద్యోగాలు భర్తీ చేయకపోవడం వలన ఖాళీలుగా మిగిలిన 1800 ఉద్యోగాలను భర్తీ చేసేలా ప్రభుత్వం ఒత్తిడి తేవాలని శనివారం అభ్యర్థులు ఎంపీ డికే అరుణకు వినతి పత్రం అందించారు. ఇప్పటికే హై కోర్టు తీర్పు ఇచ్చిన ఖాళీలు భర్తీ చేయడం లేదని ఎంపీ దృష్టికి తీసుకెళ్లారు. ఖాళీల భర్తీకి కృషి చేస్తానని ఎంపీ భరోసా ఇచ్చారు.