KNR: హుజురాబాద్ మండల వాసవి కళ్యాణ మండపంలో శనివారం తెలంగాణ రిటైర్డ్ ఉద్యోగుల అసోసియేషన్ మండల శాఖ కౌన్సిల్ సమావేశం జరిగింది. ఉస్మాన్ పాషా అధ్యక్షతన, కార్యదర్శి, ఆర్థిక కార్యదర్శి నివేదికలు సమర్పించగా, పెన్షనర్లు ఆమోదించారు. గోపాల్ రావు, కోయల్ కార్ దుర్గాజి, కార్యవర్గ సభ్యులు, అధిక సంఖ్యలో విశ్రాంతి ఉద్యోగులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.