JGL: జగిత్యాల రూరల్ మండలం కన్నాపూర్లో ఎస్సీ సబ్ ప్లాన్ నిధులు రూ 15 లక్షలతో చేపట్టనున్న అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్ బుధవారం భూమి పూజ చేశారు. బాలేపల్లిలో రూ 20 లక్షలతో నూతనంగా నిర్మించనున్న గ్రామపంచాయతీ భవన నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో రమాదేవి, ఎమ్మార్వో శ్రీనివాస్, డీఈ మిలింద్, తదితరులు పాల్గొన్నారు.