KMM: చింతకాని మండలం రాఘవపురంలో ఓ డిగ్రీ కళాశాల ఆధ్వర్యంలో శనివారం జరిగిన ఎన్ఎస్ఎస్ ప్రత్యేక శిబిరంలో విద్యార్థులు క్లీన్ అండ్ గ్రీన్ కార్యక్రమం నిర్వహించారు. తహసీల్దార్ బాజ్జీ ప్రసాద్, ఎస్సై వీరేందర్ పాల్గొని చట్టాలు, ఆరోగ్యంపై అవగాహన కల్పించారు. విద్యార్థులు క్రమశిక్షణతో సేవ కార్యక్రమాలు చేపట్టాలని ప్రిన్సిపల్ సునీల్ కుమార్ సూచించారు.