PDPL: ఓదెల మండల కేంద్రంలోని తారకరామా కాలనీ పరిధిలో 32వ రైల్వే గేటు లైన్ మరమ్మతుల కారణంగా గేటును తాత్కాలికంగా మూసివేయడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రైల్వే గేటు నుంచి డి-86 కెనాల్ బ్రిడ్జి వరకు ఉన్న ఇరుకైన రహదారిపై వాహనాలు ఎదురెదురుగా నిలిచిపోయి ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. రోడ్డు వెడల్పు పెంచాలని స్థానికులు కోరుతున్నారు.