NRML: జిల్లాలో భారీ వర్షంతో పాటు, ఎగువ ప్రాంతాల నుంచి భారీగా వరదనీరు వచ్చి చేరుతుండడంతో ఎస్సారెస్పీ (శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్) 39 గేట్లను బుధవారం రాత్రి ఎత్తివేసి మూడు లక్షల 50 వేల క్యూసెక్కుల నీటిని స్పిల్ వే గేట్స్ ద్వారా వదులుతున్నట్లు ప్రాజెక్ట్ అధికారులు తెలిపారు. దిగువప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వారు సూచించారు