RR: అంగన్వాడీల డిమాండ్ల పరిష్కారానికి తనవంతుగా కృషి చేస్తానని ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ అన్నారు. సీఐటీయూ ఆధ్వర్యంలో స్థానిక ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయానికి అంగన్వాడీ టీచర్లు చేరుకొని సమస్యలకు సంబంధించిన డిమాండ్ల పత్రాన్ని ఎమ్మెల్యేకు అందించారు. అనంతరం సీఐటీయూ నాయకుడు రాజు ఎమ్మెల్యేకు అంగన్వాడీల సమస్యలను వివరించారు.