KMM: పట్టుదలతో ముందడుగు వేసి దివ్యాంగులు అన్ని రంగాలలో రాణించాలని జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ అన్నారు. మంగళవారం స్థానిక టిఎన్జిఓస్ ఫంక్షన్ హాల్లో జిల్లా మహిళా, శిశు, దివ్యాంగుల, వయో వృద్ధుల, ట్రాన్స్ జెండర్ల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ పాల్గొన్నారు.