RR: తుర్కయంజాల్ పట్టణ పరిధిలోని బ్రాహ్మణపల్లి సమీపంలోని సాయి లీల వెంచర్ పట్టణ ప్రకృతి ప్రక్కన డంపింగ్ యార్డ్ ఏర్పాటు చేయడంతో చెత్త కుప్పలు గుట్టలను తలపిస్తున్నాయి. రోజుల తరబడి చెత్తకుప్పలు ఇక్కడే ఉండడంతో చెత్త కుప్పల నుంచి తీవ్ర దుర్గంధం వెదజల్లుతోంది. ఈ మార్గంలో రాకపోకలు కొనసాగించే బ్రాహ్మణపల్లి, కోహెడ గ్రామాల ప్రజలు, వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.