ASF: జిల్లా కేంద్రం జన్కాపూర్ ఉన్నత పాఠశాలలో అక్టోబర్ 7న జిల్లా స్థాయి సైన్స్ డ్రామా పోటీలు నిర్వహించనున్నట్లు అదనపు కలెక్టర్, DEO దీపక్ తివారి ప్రకటనలో తెలిపారు. ప్రతీ పాఠశాల నుంచి ఒక బృందం విద్యార్థులు డ్రామా నిర్వహించాలని అన్నారు. విజ్ఞాన మహిళ, స్మార్ట్ వ్యవసాయం, డిజిటల్ ఇండియా, ఆరోగ్యం, గ్రీన్ టెక్నాలజీ అంశాలపై డ్రామా ఎంపిక చేసుకోవాలన్నారు.