VKB: చెంచుల అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందని, అనేక సంక్షేమ పథకాలు అమలు చేసి వారి అభివృద్ధికి బాటలు వేస్తుందని స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ పేర్కొన్నారు. శుక్రవారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో అర్హులైన లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇళ్ల పట్టాలను ఆయన అందజేశారు. చెంచుకాలనీల అభివృద్ధికి ప్రభుత్వం ప్రత్యేకంగా నిధులు మంజూరు చేస్తుందని ఈ సందర్భంగా స్పీకర్ తెలిపారు.