NLG: మిర్యాలగూడ మున్సిపాలిటీలో ఆస్తి, నీటి పన్నులు, కాంప్లెక్స్ బకాయిలు చెల్లించి ప్రజలు పట్టణాభివృద్ధికి సహకరించాలని మున్సిపల్ కమిషనర్ జీ. శ్రీనివాస్ అన్నారు. ఆయన మాట్లాడుతూ.. మున్సిపాలిటీలో ఆస్తి పన్ను మొత్తం రూ.20.53 కోట్లకు గాను ఇప్పటివరకు రూ.7.03 కోట్లు మాత్రమే చెల్లించినట్లు తెలిపారు. బకాయిలు ఉన్నవారికి రెండుసార్లు నోటీసులు ఇవ్వడం జరిగిందని తెలిపారు.