KNR: తిమ్మాపూర్ మండలం మన్నెంపల్లిలో పురాతన యుద్ధ సన్నివేశాన్ని ప్రతిబింబించే ‘వీరగల్లు’ శిల్పం లభ్యమైందని పురావస్తు పరిశోధకుడు ‘డిస్కవరీ మ్యాన్ ‘ రెడ్డి రత్నాకర్ రెడ్డి తెలిపారు. కరణాలగడీ సమీపంలోని పాలకేంద్రం ఆవరణలో చెత్తాచెదారం శుభ్రంచేస్తుండగా ఈ శిల్పం బయటపడింది. సుమారు ఒకటిన్నర అడుగుల ఎత్తున్న నల్లరాతిపై ఒక సైనికుడు కుడిచేతిలో కత్తి ఉంది.