SRD: ఉద్యోగ ఉపాధ్యాయులకు పాత పెన్షన్ అమలు చేయాలని ఎస్టీయూ జిల్లా అధ్యక్షుడు సాబేర్ అలీ డిమాండ్ చేశారు. కందిలోని సంఘ భవనంలో మంగళవారం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఆయన మాట్లాడుతూ.. 30, 40 సంవత్సరాలు పనిచేసే ఉద్యోగ, ఉపాధ్యాయులకు పెన్షన్ ఇవ్వకపోవడం సరికాదని అన్నారు.