NGKL: బాల్మూరు మండలం మహాదేవ్‌పూర్ గ్రామంలో సెల్‌ఫోన్ టవర్ ఏర్పాటు చేయాలని గ్రామస్థులు కోరుతున్నారు. గ్రామంలో టవర్ లేకపోవడంతో అత్యవసర పరిస్థితుల్లో అంబులెన్స్ సహా ఇతర సేవలకు సమాచారం అందించడం తీవ్రంగా ఇబ్బందిగా మారిందని వారు వాపోతున్నారు. సంబంధిత అధికారులు స్పందించి త్వరితగతిన సెల్‌ఫోన్ టవర్ ఏర్పాటు చేయాలని స్థానికులు విజ్ఞప్తి చేస్తున్నారు.