PDPL: ముత్తారం మండలం హరిపురం గ్రామానికి చెందిన రైతు కూలీ దంపతుల కుమార్తె, ఉన్నత విద్య చదువుతున్న సంకీర్తనకు ఎన్ఆరి రునిల్ కుమార్ పటేల్ మానవత్వంతో స్పందించి ల్యాప్టాప్ అందజేశారు. విద్యార్థినికి ల్యాప్టాప్ అవసరం ఉందని తెలుసుకున్న రునిల్, ఆదివారం మెంగని తిరుపతి ఆధ్వర్యంలో నాయకులు నిమ్మతి రమేష్, ఒడ్నాల రవితో కలిసి దాన్ని అందించారు.