ASF: రెబ్బెన మండలం తుంగెడలో ఉపాధి హామీ పని ప్రదేశంలో ప్రమాదానికి గురైన డోంగ్రి రాధను తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కన్వీనర్ ఆనంద్ కుమార్ సోమవారం పరామర్శించారు. ఆయన మాట్లాడుతూ.. ఉపాధి హామీ పనుల సమయంలో ప్రమాదాలకు గురయ్యే కార్మికులకు ప్రభుత్వం పూర్తి వైద్య ఖర్చులను భరించాలని డిమాండ్ చేశారు. ప్రమాద తీవ్రతను బట్టి తగిన నష్టపరిహారం చెల్లించాలని కోరారు.