RR: గచ్చిబౌలిలోని మనూ ఉర్దూ విశ్వవిద్యాలయంలోని దూరవిద్య కోర్సుల ప్రవేశాలకు ఈనెల 13 వరకు పొడిగించినట్లు సెంటర్ ఫర్ డిస్టెన్స్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ ప్రొఫెసర్ రజౌల్లాఖాన్ తెలిపారు. ఈ విద్యా సంవత్సరం నుంచి నాలుగేళ్ల బీఏ (ఆనర్స్), బీకాం (ఆనర్స్), బీఎస్సీ (ఆనర్స్) కోర్సులు ప్రవేశపెడుతున్నామన్నారు. మరిన్ని వివరాలకు విశ్వవిద్యాలయంలో సంప్రదించాలన్నారు.