ASF: జిల్లా కలెక్టరేట్లో మంగళవారం సాయంత్రం న్యాయ విజ్ఞాన సదస్సు నిర్వహిస్తున్నట్లు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్, జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఎం.వి.రమేశ్ ఒక ప్రకటనలో తెలిపారు. మెయింటనెన్స్ అండ్ వెల్ఫేర్ ఆఫ్ పేరెంట్స్, సీనియర్ సిటిజన్స్ చట్టంపై అవగాహన కార్యక్రమం ఉంటుందన్నారు. ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.