KMM: రామదాసు కళాక్షేత్రం ప్రక్కన ఉన్న పాత అగ్రికల్చర్ మార్కెట్ స్థలంలో షెడ్లు, ప్లాట్ ఫామ్ల నిర్మాణ పనులకు మంగళవారం మంత్రి తుమ్మల నాగేశ్వరరావు శంకుస్థాపన చేశారు. రైతులు నేరుగా మార్కెట్కు వచ్చి కూరగాయలను అమ్ముకోవడం వల్ల వినియోగదారులకు, రైతులకు లాభం చేకూరుతుందని మంత్రి తెలిపారు. రైతులే నేరుగా వచ్చి రైతు బజార్లో వ్యాపారం చేయాలన్నారు.