BDK: అశ్వారావుపేట నియోజకవర్గ ప్రజలకు ఎమ్మెల్యే జారె ఆదినారాయణ ఇవాళ ముందస్తుగా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నూతన సంవత్సర వేడుకలను ప్రతి ఒక్కరూ ఆనందంగా ఉల్లాసంగా జరుపుకోవాలని కోరారు. అదే సమయంలో డిసెంబర్ 31 రాత్రి శాంతి భద్రతలకు ఎలాంటి విఘాతం కలగకుండా తగు జాగ్రత్తలు పాటిస్తూ వేడుకలు నిర్వహించుకోవాలని సూచించారు.