MDCL: కుత్బుల్లాపూర్లో కుక్క కాటు ఫిర్యాదుపై GHMC బృందం స్పందించింది. మొత్తం 12 వీధి కుక్కలను పట్టుకొని వాటిలో 10 స్టెరిలైజ్ చేసినవి, 2 స్టెరిలైజ్ చేయనివిగా గుర్తించారు. అన్ని కుక్కలను పరిశీలన నిమిత్తం యానిమల్ కేర్ సెంటర్కు తరలించినట్లు తెలిపారు. బాధితుడికి అవసరమైన వైద్య విధానాన్ని వివరించగా, ఆయన ఇప్పటికే RIG & ARV చికిత్సలు తీసుకున్నారు.