NLG: మిర్యాలగూడ మండలం ఉట్లపల్లి ప్రజల దాతృత్వం ఎందరికో స్ఫూర్తినిస్తోంది. గ్రామానికి చెందిన పసిడి సైదులు దీర్ఘకాలిక వ్యాధితో బాధపడుతూ ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న విషయం తెలుసుకున్న గ్రామస్తులు అతడిని ఆదుకోవాలని నిర్ణయించారు. గ్రామ వాట్సాప్ గ్రూప్ ద్వారా నిధులు సేకరించి, రూ.50 వేలను బాధిత కుటుంబానికి అందజేశారు.