KMM: జిల్లాలో ఇందిరా మహిళా డెయిరీ ద్వారా మూడేళ్లలో 20 వేల మందికి లబ్ధి చేకూర్చాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఆదేశించారు. నిన్న నిర్వహించిన సమీక్ష సమావేశంలో మాట్లాడుతూ.. మహిళల ఆర్థికాభివృద్ధికి నాణ్యమైన పాడి పశువులను అందించి పాల ఉత్పత్తి పెంచేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ అనుదీప్, అదనపు కలెక్టర్ శ్రీజ పాల్గొన్నారు.