SRCL: బోయినిపల్లి మండల కేంద్రంలోని తెలంగాణ మోడల్ స్కూల్లో 6 నుంచి పదో తరగతి వరకు హిందీ (టిజిటి) సబ్జెక్ట్ బోధించుటకు అర్హత గల అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ప్రిన్సిపల్ రఘునాథ్ తెలిపారు. హిందీ టీచర్ పోస్ట్ కోసం హిందీ పండిట్ శిక్షణతో పాటు టెట్ అర్హత కలిగి ఉండాలని, ఆసక్తి గల అభ్యర్థులు శనివారం లోపు బోయినిపల్లి మోడల్ స్కూల్లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.