NRML: ఖానాపూర్ నియోజకవర్గంలోని మారుమూల గ్రామాలకు వెళ్లే రోడ్లకు శాశ్వత మరమ్మతులు చేయాలని ప్రజలు కోరారు. ‘నియోజకవర్గంలోని పలు మండలాల్లో ఇటీవల భారీ వర్షాలకు చాలా గ్రామాలకు వెళ్లే రోడ్డు బురదమయంగా మారాయి. ప్రస్తుతం వర్షాలు కురవకపోయినా ఆ రోడ్లపై గుంతలు ఏర్పడడంతో వెళ్ళలేని పరిస్థితి ఉందని’ ప్రజలు వాపోయారు.