NZB: వరి కొనుగోలు కేంద్రాల వద్ద రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా అన్ని ఏర్పాట్లు చేపట్టాలని కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ అన్నారు. గురువారం గాంధారి మండలం సీతాయిపల్లిలో పాక్స్ ఆధ్వర్యంలో వరి కొనుగోలు కేంద్రాన్ని కలెక్టర్ ప్రారంభించారు. కేంద్రాల వద్ద రైతులకు కావలసిన మౌలిక సదుపాయాలు ఏర్పాటు, వర్షాలు కురుస్తున్నందున ధాన్యం తడిసి పోకుండా టార్పాలిన్ ఏర్పాటు చేయాలి అని అన్నారు.