NLG: చలకుర్తి క్యాంపు జవహర్ నవోదయ విద్యాలయంలో 2025-26 విద్యా సంవత్సరానికి గాను 9వ తరగతి, 11వ తరగతిలో ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ప్రిన్సిపల్ నాగభూషణం గురువారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. 9వ తరగతిలో చేరేవారు 01-05-2010 నుంచి 31-07-2012 మధ్య జన్మించిన వారు, 11వ తరగతిలో చేరేవారు 01-06-2008 నుంచి 31-07-2010 మధ్య జన్మించిన వారై ఉండాలన్నారు.