WGL: దేశాయిపేట సీకేఎం కళాశాల మైదానంలో గత రెండు రోజులుగా నిర్వహించిన ఆరు జట్ల ఎంపికలు ముగిశాయి. వరంగల్, హనుమకొండ, ములుగు, భూపాలపల్లి, జనగామ, మహబూబాబాద్ జిల్లాల జట్లను ఎంపిక చేశారు. ఎంపికైన జట్లు వరంగల్ నగరంలో ఈనెల 20 నుంచి 23 వరకు జరిగే ఉమ్మడి జిల్లా స్థాయి అండర్-23 లీగ్ కమ్ నాకౌట్ క్రికెట్ పోటీల్లో పాల్గొననున్నాయి.