NRML: జిల్లాలోని ప్రభుత్వ ప్రైవేటు విద్యార్థులకు ఈనెల 19 న కళా ఉత్సవ్ -2024 జిల్లాస్థాయి పోటీలు నిర్వహిస్తున్నట్లు జిల్లా విద్యాధికారి ఏ రవీందర్ రెడ్డి గురువారం ప్రకటనలో తెలిపారు. పట్టణంలోని జేవిఎన్ ఆర్ శాంతినగర్ పాఠశాలలో ఈ పోటీలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. మొత్తం ఆరు విభాగాలలో ఈ పోటీలు ఉంటాయని పేర్కొన్నారు.